ETV Bharat / crime

BANK ROBBERY: గచ్చిబౌలి సెంట్రల్​ బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని సెంట్రల్​ బ్యాంకు బ్రాంచీలో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఖమ్మంకు చెందిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

BANK ROBBERY: గచ్చిబౌలి సెంట్రల్​ బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
BANK ROBBERY: గచ్చిబౌలి సెంట్రల్​ బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Sep 9, 2021, 3:14 PM IST

Updated : Sep 9, 2021, 10:25 PM IST

BANK ROBBERY: గచ్చిబౌలి సెంట్రల్​ బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పక్కనే.. గచ్చిబౌలి ప్రధాన రహదారి మీద ఉన్న సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలో చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఘటనకు సంబంధించి ఖమ్మంకు చెందిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది..

సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పక్కనే.. ప్రధాన రహదారి మీద ఉన్న సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలో దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి రెండున్నర ప్రాంతంలో బ్యాంకు కిటికీ గ్రిల్​ తొలగించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు.. సీసీ కెమెరాల వైర్లు కట్​చేసి.. స్ట్రాంగ్​ రూమ్ తలుపులు తెరిచేందుకు యత్నించారు. ఫాల్​ సీలింగ్ కూల్చి స్ట్రాంగ్​ రూంలోనికి వెళ్లేందుకు యత్నించినా.. సాధ్యం కాకపోవడం వల్ల బ్యాంకులోని కంప్యూటర్లు, హార్డ్​ డిస్కులు, ఇతర సామగ్రిని ఓ ఆటోలో సర్దుకొని పరారయ్యారు.

దాదాపు 3 గంటల పాటు వారి దోపిడీ యత్నం కొనసాగగా.. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాంకు నుంచి పారిపోయినట్లు బ్యాంకు బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైంది. ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాయదుర్గం పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్​లను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత కథనం..

BANK ROBBERY: బ్యాంకులో దోపిడీకి యత్నం.. కంప్యూటర్లు, హార్డ్​డిస్కులతో పరార్..

Last Updated : Sep 9, 2021, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.