ETV Bharat / crime

బ్యాంకులో నగదు మాయం కేసు.. క్యాషియర్ ప్రవీణ్ వాహనం గుర్తింపు - police found cashier bike at chityala in bank of baroda

Bank Of Baroda Cashier case: వనస్థలిపురం బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో నగదు మాయం కేసులో నిందితుడిగా ఉన్న క్యాషియర్​ ప్రవీణ్​ బైక్​ను పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్​ కోసం పోలీసులు గాలిస్తుండగా.. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రవీణ్​ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Bank Of Baroda Cashier case
బ్యాంకు ఆఫ్​ బరోడాలో నగదు మాయం
author img

By

Published : May 13, 2022, 3:21 PM IST

Bank Of Baroda Cashier case: హైదరాబాద్​ వనస్థలిపురం బ్యాంక్​ ఆఫ్ బరోడా కేసులో నిందితుడిగా ఉన్న క్యాషియర్ ప్రవీణ్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... దానిని స్వాధీనం చేసుకున్నారు. 4 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్ ద్విచక్రవాహనం చిట్యాల వద్ద ఉన్నందున... నిందితుడు సూర్యాపేట, కోదాడ వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Bank Of Baroda Cashier case
క్యాషియర్​ ప్రవీణ్​

వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్​ నగర్​ శాఖలో రూ. 22.53 లక్షల నగదు తేడా వచ్చినట్లు మేనేజర్ వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం(మే 10న) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రవీణ్ బ్యాంకు నుంచి వెళ్లిపోయాడని.... అతనిపైనే అనుమానం ఉందని వినయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రవీణ్​ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ వచ్చినట్లు మేనేజర్ పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. క్రికెట్, ఆన్​లైన్ బెట్టింగ్​లో డబ్బులు నష్టపోయినట్లు ప్రవీణ్, తన తల్లి చరవాణికి మంగళవారం రోజు సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ డబ్బులు గెల్చిన తర్వాతే తిరిగి విధుల్లోకి వస్తానని తోటి సిబ్బందితో ప్రవీణ్ చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ కోసమే ప్రవీణ్, బ్యాంకు డబ్బులు వినియోగించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా తాను ఏ తప్పు చేయలేదని ప్రవీణ్ నిన్న సెల్ఫీ వీడియో పంపించాడు. గత 2 నెలలుగా బ్యాంకు లావేదేవీల్లో నగదు తక్కువగా వస్తోందని, ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ప్రవీణ్ తెలిపాడు. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రవీణ్ ఆరోపించాడు. ప్రవీణ్ తీసుకెళ్లాడని బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయగా... తనకు ఏ తప్పు తెలియదని ప్రవీణ్ చెప్పడంతో అసలు 22.53 లక్షలు ఎక్కడ పోయాయనే విషయం పోలీసులకు సవాల్​గా మారింది. ప్రవీణ్​ను ప్రశ్నిస్తే కానీ అసలు విషయం బయటికి రాదని పోలీసులు చెబుతున్నారు. కాగా నగదు మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్​ ప్రవీణ్​ను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ప్రవీణ్​.. ప్రస్తుతం పోలీసు కేసులో నిందితుడిగా ఉన్నాడని... విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: KISHAN REDDY: 'భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు'

కాంగ్రెస్​లో 'ఒకే కుటుంబం- ఒకే పదవి​' రూల్.. సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.