ETV Bharat / crime

murder case: అడ్డు తొలగించాలనుకున్నారు... అడ్డంగా దొరికిపోయారు

author img

By

Published : Aug 14, 2021, 5:20 AM IST

ఇన్నాళ్లూ అన్నిట్లో సాయం చేసిన పొరుగింటి వ్యక్తి పెళ్లయ్యాక మారిపోయాడు. భార్య రాగానే వారిని పట్టించుకోవడం మరిచిపోయాడు. ఆర్థికంగా సాయం లేదు.. ఆ వైపు చూపేలేదు. ఇదే కోపంతో తమ బంధానికి అడ్డొస్తుందని పూజ అనే అమాయక మహిళను హత్య చేశారు ఇద్దరు దంపతులు. అమెను హత్యచేసి ప్రియుడు వచ్చి చంపాడని ఓ కథ అల్లారు. అనుమానం వచ్చిన జీడిమెట్ల పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగితే కొత్త కథ బయటపడింది.

murder case
murder case

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల వినాయక్ నగర్​లో ఈనెల 10న జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఝార్ఖండ్‌కుచెందిన రాజేశ్‌ వర్మ జీడిమెట్ల పరిధిలోని వినాయక్‌ నగర్‌లో ఐదేళ్లుగా నివాసముంటున్నాడు. అతని పక్క గదిలో యూపీకి చెందిన సంజిత్‌, రింకు దంపతులుంటున్నారు. ఆటో డ్రైవర్‌ అయిన సంజిత్‌ జులాయిగా తిరిగి అప్పులపాలయ్యాడు. ఈ సమయంలో రింకుకు దగ్గరైన రాజేశ్‌ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఇంటికి కావాల్సిన అన్ని ఖర్చులు తానే భరించాడు. కొన్నేళ్లుగా సంజిత్‌కు ఈ విషయం తెలిసినా డబ్బుల కోసం కథ నడిపించాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జార్ఖండ్‌కు చెందిన పూజ(21)అనే యువతిని పెళ్లి చేసుకున్న రాజేశ్‌ ఆమెనూ ఇదే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి రింకుకు దూరంగా ఉండటంతో పాటు ఇంటి ఖర్చులకు డబ్బులివ్వడం ఆపేశాడు. పూజ రావడంతోనే తమకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ఇలాగే ఉంటే రాజేశ్‌ పూర్తిగా దూరమవుతాడని భావించిన దంపతులిద్దరూ పూజను హత్యచేసేందుకు పథకం రచించారు. ఈనెల 10న రాజేశ్‌ విధులకు వెళ్లిన సమయంలో నిద్రపోతున్న పూజపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.

నమ్మించేలా కట్టుకథ...

ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ప్రియుడు, మరో వ్యక్తి వచ్చి గొడవపడ్డారని, ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. నిరాకరించడంతో హత్య చేశారని పోలీసులకు కట్టుకథ చెప్పారు. అనుమానం వచ్చిన జీడిమెట్ల సీఐ బాలరాజు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. రెండు రోజుల్లో అసలు నిందితులు వీళ్లేనని తేల్చారు. విచారణలో వారు ఒప్పుకోవడంతో కిరాతక దంపతుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: CRIME: తల్లిని కొట్టాడని.. మేనమామపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.