ETV Bharat / crime

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కిరాతకం.. భార్యను చంపి సూట్‌ కేసులో పెట్టి.. - తిరుపతి జిల్లా తాజా వార్తలు

ఏపీ తిరుపతిలోని సత్యనారాయణపురంలో వివాహిత పద్మావతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పద్మను భర్తే హత్యచేసినట్లు తేల్చారు. నగర శివారులోని వెంకటాపురం చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

women missing
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కిరాతకం.. భార్యను చంపి సూట్‌ కేసులో పెట్టి..
author img

By

Published : May 31, 2022, 3:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 5 నెలల క్రితం జరిగిన ఘోరం ఆలస్యంగా బయటపడింది. తనతో విభేదించి పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి తీసుకెళ్తున్నట్లు నమ్మించిన భర్త.. అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని చెరువులో పడేసి కనిపించకుండా పోయాడు. అనుమానంతో అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్నేళ్ల తర్వాత ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది.

వీడిన మిస్టరీ: తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన పద్మ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. పద్మను ఆమె భర్తే కిరాతంగా హత్య చేసినట్లు నిర్ధరించారు. జనవరి ఐదో తేదీనే భార్యను చంపేసిన వేణుగోపాల్‌... మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి చెరువులో పడేశాడు. అప్పటినుంచి పద్మ తనతోపాటే ఉందంటూ అత్తగారి కుటుంబాన్ని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా పద్మ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, వేణుగోపాల్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో... పద్మ కుటుంబసభ్యులు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు... నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తిరుపతి శివారు వెంకటాపురం చెరువులో గాలించారు. అక్కడ సూట్‌కేసు స్వాధీనం చేసుకుని... కుళ్లిన స్థితిలో ఉన్న పద్మ మృతదేహాన్ని గుర్తించారు.

తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన వేణుగోపాల్‌కు... 2017లో పద్మతో వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని... పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలోనే పద్మను హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడు వేణుగోపాల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు చెప్పారు.

పెళ్లైన మొదటిరోజు నుంచే పద్మను భర్త తీవ్రంగా వేధించేవాడని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. వేధింపులు తాళలేక పుట్టింట్లో ఉన్న పద్మను... జనవరి ఐదే తేదీన కాపురానికి రమ్మని తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే ఇంతటి దారుణానికి పాల్పడతాడని ఊహించలేదని... నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వివాహం జరిగే నాటికి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కిరాతకం.. భార్యను చంపి సూట్‌ కేసులో పెట్టి..

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.