ఈ నెల26న తెల్లవారుజామున విశాఖలో పెళ్లింట్లో విషాదం నెలకొన్న ఘటనలో పోలీసులు అదనపు సమాచారాన్ని ఇచ్చారు. 'పెళ్లిరోజు భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో తల్లి విజయలక్ష్మిని ఇంటికి తీసుకెళ్లాలని తండ్రిని పెళ్లికుమార్తె కోరింది. దీంతో జగన్నాథరావు తన భార్యను భానునగర్‌లోని ఇంటికి వెళ్లిపోయారు. కాసేపటికి తరువాత బంధువులు వెళ్లి చూడగా.. వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. జగన్నాథరావే భార్యను హత్య చేసి తానూ ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం. విజయలక్ష్మి 15 ఏళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం' అని చేపట్టినట్లు సీఐ రమణయ్య తెలిపారు.
ఇదీ చదవండి.. కుమార్తె వివాహం.. విగతజీవులుగా తల్లిదండ్రులు.. అసలేమైంది?