ETV Bharat / crime

బీచ్​లో చోరీచేశాడు.. పోలీసులకు దొరికాడు... - విశాఖపట్నం వార్తలు

ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్​లో పర్యటనకు వచ్చిన వారి నుంచి బంగారం, సెల్​ఫోన్​ ఉన్న బ్యాగ్​ దొంగిలించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి లక్షా 50వేల రూపాయల విలువ చేసే బంగారం, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

police-caught-robber-and-recovered-phone-and-gold-from-him-in-visakapatnam
నగల దొంగను పట్టుకున్న పోలీసులు.. బంగారం స్వాధీనం
author img

By

Published : Feb 22, 2021, 7:05 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఆర్కే బీచ్​లో పర్యాటకులకు చెందిన 66 తులాల బంగారాన్ని దొంగిలించిన కేసులో పోలీసులు నిందితుడు సీపాన నరసింహను అరెస్ట్​ చేశారు. చెన్నైకు చెందిన రంజన్ కుమార్ గుప్తా.. రాయ్​పూర్ నుంచి చెన్నైకి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా విశాఖలో రైలు మారాల్సి వచ్చింది. చెన్నైకి వెళ్లే రైలుకు ఇంకా సమయం ఉన్నందున ఈనెల 20న విశాఖ ఆర్కే బీచ్ సందర్శించేందుకు వెళ్లారు.

ఇదే సమయంలో వారికి చెందిన బంగారు నగలు, మొబైల్​ఫోన్ ఉన్న బ్యాగ్​ను నిందితుడు నరసింహ దొంగిలించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని విశాఖ గొల్లలపాలెం వద్ద అరెస్టు చేసి.. లక్షా 50 వేల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: కిడ్నాపర్​గా భావించి ఓ వ్యక్తికి దేహశుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.