ETV Bharat / crime

Luxury Car Thief: చుక్కలు చూపిస్తున్న కరడుగట్టిన లగ్జరీ కార్ల దొంగ

Luxury Car Thief: అతడి పేరు.. సత్యేంద్ర సింగ్‌ షెకావత్‌. ఎంబీఏ గ్రాడ్యుయేట్‌. రాజస్థాన్‌లోని జైపూర్‌ సొంతూరు. దర్జా దొంగ, గజదొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగలందు ఈ దొంగోడు వేరు. ఎందుకంటే.. షెకావత్‌ టార్గెట్‌ ఓన్లీ.. ఖరీదైన కార్లు. ఒక కారును కొట్టేసేందుకు రోజులు, నెలలు కూడా ఎదురుచూస్తాడు. అదను, అవకాశం రెండూ దొరగ్గానే క్షణాల్లో మాయం చేస్తాడు. ఇప్పటి వరకూ దాదాపు 100 కార్లు.. అది కూడా రూ.కోటికిపైగా ధర ఉన్న కార్లనే ఎత్తుకెళ్లి.. అమ్మేసి సొమ్ము చేసుకుని జల్సాలకు ఖర్చుచేసినట్టు సమాచారం. దేశంలోని ప్రధాననగరాల్లో కార్లను కొట్టేసిన ఇతగాడు రెండేళ్ల క్రితం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నాచారం ప్రాంతాల్లోనూ ఖరీదైన రెండు కార్లను ఎత్తుకెళ్లాడు. ఈ కేసుల్లో ఇతడిని అరెస్ట్‌ చేయటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పుడెందుకీ ప్రసక్తి అంటే.. తాజాగా మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేసిన కార్ల దొంగలకు షెకావత్‌ శిక్షణనివ్వటమే కాదు.. వాళ్లు తెచ్చిన కార్లను అమ్మేందుకు సహకరిస్తున్నట్టు కూడా పోలీసులు భావించటమే.

Luxury Car Thief: చుక్కలు చూపిస్తున్న కరడుగట్టిన లగ్జరీ కార్ల దొంగ
Luxury Car Thief: చుక్కలు చూపిస్తున్న కరడుగట్టిన లగ్జరీ కార్ల దొంగ
author img

By

Published : Dec 20, 2021, 8:30 PM IST

Luxury Car Thief: కరడుగట్టిన లగ్జరీకార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌. వయసు 41-42 మధ్య ఉంటుంది. ఎంబీఏ పూర్తి చేశాడు. సినిమా హీరోను తలదన్నేలా ఉంటాడు. రూ.లక్ష ఖరీదైన దుస్తులు ధరిస్తాడంటే ఏ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతాడు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఐదు నక్షత్రాల హోటళ్లలో బసచేస్తాడు. షాపింగ్‌మాల్స్, పబ్‌లు, హోటళ్లకు క్యాబ్‌లో వెళ్లిన షెకావత్‌.. ఖరీదైన కారులో ఒంటరిగా తిరిగి బయటకు వస్తాడు. అక్కడున్న భద్రతా సిబ్బంది గమనించినా పట్టించుకోరు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా పక్కా వ్యాపారవేత్తగా దర్పం ప్రదర్శిస్తాడు. ఇతడు కార్లను దొంగిలించే పద్ధతి చూసి ఖాకీలు సైతం విస్మయానికి గురవుతుంటారు. తాజాగా మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేసిన అంతరాష్ట్ర కార్ల దొంగ ముఠా కూడా ఇదే తరహాలో 50కు పైగా కార్లను చోరీ చేసింది. తెరవెనుక ఉన్న షెకావత్‌ అంతరాష్ట్ర ముఠాలకు శిక్షణనిస్తూ ఇదంతా నడిపిస్తున్నాడని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అతడు రూ.100 కోట్ల విలువైన 100కు పైగా కార్లను దొంగిలించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

హ్యాండీ బేబీతో క్లోనింగ్‌

car thief: ఎంబీఏ పూర్తిచేసిన షెకావత్‌ కన్నుపడితే ఎంత ఖరీదైన కారైనా మాయం కావాల్సిందే. యూట్యూబ్‌లో చూసి కారు దొంగతనం చేసేందుకు కొత్త పద్ధతులు తెలుసుకుంటాడు. అక్కడ నుంచి సేకరించిన సమాచారంతో రూ.2లక్షలతో చైనాకు చెందిన హ్యాండీబేబీ పరికరం, ఎలక్ట్రానిక్‌ కీ కటింగ్‌ మెషీన్, పవర్‌ సప్లై మెషీన్‌ కొనుగోలు చేశాడు. కారు సర్వీసింగ్‌ సెంటర్లు, సెకండ్‌ హ్యాండ్‌ షోరూమ్‌లకు వెళ్లి తన పథకాన్ని అమలు చేస్తాడు. హ్యాండీబేబీ పరికరం సాయంతో తాళం సమాచారం(కీ డేటా) సేకరిస్తాడు. చోరీ చేయాలనుకున్న కారు జీపీఎస్‌ సిస్టమ్‌ను హ్యాక్‌ చేస్తాడు. ఎలక్ట్రానిక్‌ కీ కటింగ్‌ మెషీన్‌ సాయంతో నకిలీ తాళం తయారు చేస్తాడు. ఎప్పటికప్పుడు జీపీఎస్‌ ద్వారా కారు ఎక్కడ ఉన్నదనే వివరాలు సేకరిస్తాడు. సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో కారు ఉన్నట్టు నిర్ధారించుకున్నాక అక్కడకు వెళ్లి నకిలీ తాళం సాయంతో కారును దొంగిలిస్తాడు. దొంగిలించిన ప్రాంతంలో కాకుండా మరో రాష్ట్రంలో కార్లను అమ్మి సొమ్ము చేసుకుంటాడు. 2016లో అరెస్టయి జైలుకెళ్లొచ్చినా మళ్లీ అదే బాట పట్టాడు. ప్రస్తుతం కారు దొంగతనం చేయటంలో యువకులకు శిక్షణనిస్తున్నట్టు సమాచారం.

రాచకొండ పోలీసుల గురి?

రాజస్థాన్‌లోని జైపూర్‌ సమీపంలో ఉండే సత్యేంద్రసింగ్‌ షెకావత్‌.. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఖరీదైన కార్లు దొంగిలించాడు. ఇతడిపై హైదరాబాద్‌తో సహా, దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు, వడోదర, జాంనగర్‌ తదితర ప్రధాన నగరాల్లో కేసులు నమోదయ్యాయి. గతంలో ముంబయి, అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లోని హోటల్‌లో సినీనిర్మాతకు చెందిన ఖరీదైన కారును దర్జాగా దొంగిలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పట్టుకోండి చూద్దామంటూ నగర పోలీసులకు షెకావత్‌ సవాల్‌ కూడా విసిరాడు. అతడి కోసం రాజస్థాన్‌ వెళ్లిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో తనను పట్టుకోవాలంటే పదేళ్ల సమయం పడుతుందంటూ ఎద్దేవా చేయటం గమనార్హం. ఇంతటి మాయగాడిని పక్కా సమాచారంతో పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు సన్నద్ధమైనట్టు సమాచారం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.