ETV Bharat / crime

మైనర్​ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితులు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న బాలికపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Police arrested three accused in a case of rape of a minor girl in Sangareddy district
సంగారెడ్డి జిల్లాలో మైనర్​ బాలికపై అత్యాచారం కేసు
author img

By

Published : Apr 18, 2021, 3:54 AM IST

సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఓ మైనర్ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈ నెల 15వ తేదీన ఇంట్లో నుంచి ఉదయం వెళ్లిన అమ్మాయి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుంది. అనుమానం వచ్చిన కుటుంబీకులు అమ్మాయినినిలదీశారు. పట్టణానికి చెందిన ఓ మెడికల్ షాప్ యజమానితో పాటు మరో ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి... తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులకు వివరించింది.

ఈ మేరకు బాలిక కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు.

ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.