ETV Bharat / crime

10రూపాయలు పంపిస్తే... 6.40 లక్షలు కాజేశాడు...! - 6 lakhs fraud in sim reactivation

సైబర్​ నేరగాళ్ల వలకు బాధితులు విలవిల్లాడిపోతున్నారు. ఎర చిన్నగా వేసి... ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. సిమ్​ రీ యాక్టివేషన్​ కోసం పది రూపాయలు పంపమని... ఏకంగా ఖాతాలో ఉన్న రూ.6.40 లక్షలు మాయం చేశాడో సైబర్​ నేరగాడు.

police arrested cyber Cheater in Hyderabad

author img

By

Published : Mar 13, 2021, 11:33 AM IST

సిమ్ నెట్​వర్క్​ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితున్ని రాచకొండ సైబర్ క్రైం పొలీసులు అరెస్ట్​ చేశారు. జార్ఖండ్ జాంతారకి చెందిన బీర్బల్ పండిట్​... నెట్​వర్క్ గడువు ముగుస్తుందంటూ జనవరి 17 ఓ మహిళకు సందేశం పంపించాడు. అనంతరం ఫోన్​చేసి క్విక్ సపోర్ట్ యాప్ డౌన్​లోడ్ చేయించిన పండిట్...​ రీ యాక్టివేషన్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 పంపమనన్నాడు.

బాధితురాలు వెంటనే రూ.10 పంపింది. క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా ఓటీపీ కాపీ చేసిన పండిట్​.. ఖాతాలోని 6 లక్షల 40 వేలను స్వాహా చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఛాటింగ్​తో బుట్టలోవేస్తారు.. ఆపై బురిడీ కొట్టిస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.