ఏటీఎం చోరీకి యత్నిస్తూ ఇద్దరు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్లోని ఇండీ క్యాష్ ఏటీఎం చోరీకి మంగళవారం అర్ధరాత్రి దుండగులు విఫలయత్నం చేశారు. గదిలోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి... ఏటీఎం యంత్రంలో నగదు బాక్సులను అమర్చే భాగాన్ని ధ్వంసం చేసి డబ్బులు కాజేసేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
నిత్యం తెరిచి ఉండే ఏటీఎం మూసి ఉండడం వల్ల పెట్రోలింగ్కి వెళ్లిన పోలీసులకు అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి లోపల చోరీకి యత్నిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. పోలీసుల రాకను గుర్తించిన మరో వ్యక్తి పారిపోతుండగా చిరాగ్పల్లి పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు. ఇద్దరు నిందితులు కోహిర్ పట్టణానికి చెందినవారని వివరించారు.
ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!