ETV Bharat / crime

fake police: తల్లిని సంతోష పెట్టాలని కానిస్టేబుల్ వేషం.. చివరకు ఏమైందంటే.. - విజయవాడలో నకిలీ పోలీస్ అరెస్టు

కానిస్టేబుల్‌ డ్రెస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే డబ్బు కోసమో, సరదా కోసమో తాను పోలీసు యూనిఫాం వేసుకోలేదు. తల్లి సంతోషం కోసం.. ఒక్కసారి ఆమెకు యూనిఫాంలో కనిపించాలనుకున్నాడు. ఈలోపే పోలీసులకు దొరికిపోయాడు.

police-arrest-a-man-due-to-appeared-suspiciously-in-a-constable-dress-at-vijayawada
తల్లిని సంతోష పెట్టాలని కానిస్టేబుల్ వేషం.. చివరకు ఏమైందంటే..
author img

By

Published : Aug 2, 2021, 10:30 AM IST

తల్లి సంతోషం కోసం పోలీస్‌ యూనిఫాంతో తిరుగుతున్న ఓ యువకుడు కటకటాలపాలైన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నున్న గ్రామీణ సీఐ హనీష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. తోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా ఫృథ్వీరాజ్‌ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు. తండ్రి లేక పోవడంతో తల్లి సుజాత కూలి పనులు చేసి అతడిని కష్టపడి పెంచింది. ఫృథ్వీరాజ్‌ 2017లో పోలీసు కానిస్టేబుల్‌ సెలక్షన్స్‌కు వెళితే, ఉద్యోగానికి ఎంపికవ్వలేదు. అయినప్పటికీ తనకు విజయవాడ సమీపంలో పోలీసు ఉద్యోగం వచ్చిందని, ఓ యూనిఫాం కొనుగోలు చేసుకున్నాడు. తన తల్లితో పాటుగా బంధువులు, ఊళ్లో వారందరినీ నమ్మించాడు.

ఊళ్లో పోలీసులు యూనిఫాం.. కోళ్ల ఫాంలో సాధారణ బట్టలు..

యూనిఫాంలోనే ఊళ్లో తిరుగుతుండటంతో అందరూ నిజంగానే పోలీసు ఉద్యోగం వచ్చిందని నమ్మారు. ఏడాది క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2018లో శిక్షణ నిమిత్తం వెళుతున్నానని చెప్పి, కొద్ది నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో నున్న సమీపంలో తన స్నేహితుడికి చెందిన కోళ్ల ఫారం నిర్వహిస్తుండేవాడు. జీతం వచ్చిందని ప్రతి నెలా కొంత నగదు.. ఇంట్లో ఇస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో, ఊళ్లో పోలీసు యూనిఫాంలో తిరుగుతూ ఉండే అతడు.. కోళ్ల ఫారం వద్దకు వచ్చినపుడు మాత్రం సాధారణ దుస్తుల్లో పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇంటికి వెళ్లేప్పుడు మాత్రం యూనిఫాం వేసుకునేవాడు.

సమాచారం రావడంతో పోలీసులు నిఘా..

ఇతడి గురించి పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. కండ్రిక కూడలిలో ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా.. యూనిఫాంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఫృథ్వీరాజ్‌ని ఆపారు. పూర్తి వివరాలు అడగ్గా.. నకిలీ పోలీసుగా తేలింది. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా.. తానెవ్వరినీ యూనిఫాంతో భయ పెట్టలేదని, తన తల్లి సంతోషం కోసమే పోలీసు ఉద్యోగం వచ్చిందని చెబుతూ... యూనిఫాంతో తిరుగుతున్నానంటూ ఫృథ్వీరాజ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: నిన్న గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.