Pigs breeders tyranny: రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పందులను పట్టుకునేందుకు వెళ్లిన వారిని పందుల పెంపకందారులు కర్రలతో కొట్టి, పిడి గుద్దులు గుద్దిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది. నివాస ప్రాంతాల్లో పందులు తిరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. మున్సిపల్ అధికారులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి పందుల పెంపకం దారులను పట్టణానికి దూరంగా వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో ప్రజారోగ్యం దృష్ట్యా పందులను పట్టుకునేందుకు మున్సిపల్ అధికారులు.. తెలంగాణలోని ఖమ్మం నుంచి మనుషులను రప్పించి వీధుల్లో తిరుగుతున్న పందులను పట్టుకునే ప్రయత్నం చేశారు.
పందుల పెంపకం దారులు ఒక్కసారిగా పందులను పట్టుకుంటున్న వారిపై కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా మున్సిపల్ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వాహనంలో ఉన్న పందులను విడిపించుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై పెద్దాపురం పోలీసులకు బాధితులు, మునిసిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారులనే కొడతాం మీరెంతా.. అంటూ తమను విచక్షణ రహితంగా కొట్టారని.. మీడియా ముందు బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి: