Short Circuit: ఏపీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడు గ్రామంలో ఆలకుంట నాగేశ్వరరావు అనే రైతు పొలంలో విద్యుత్ తీగలు రాసుకుని బొప్పాయి తోట ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో చెట్లకు నీరు సరఫరా చేసే పైపులు, సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న బొప్పాయి చెట్లు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. 30 కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధం
కన్నబిడ్డపై తల్లి కర్కశత్వం.. ఛాతిపై బాది.. నేలకేసి కొట్టి..