Panchayat Secretary found by ACB: అవినీతి రూపుమాపడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొందరు అధికారులకు అవి అన్ని దిగతుడుపే.. చక్కగా వారి పని వారు కానిచ్చేస్తున్నారు. మరికొందరు ఇలా ఏసీబీ అధికారులకు దొరికి బట్టబయలు అవుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బాబుపేట గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీధర్ లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు
బాబు పేట గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దేవ తిరుపతి చిన్న పరిశ్రమల కేంద్ర నిర్మాణం అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శని కోరగా అతను లక్ష రూపాయాలు డిమాండ్ చేశారు. దీంతో ఆ విశ్రాంత ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాపు ఎదురుగా బస్‌స్టాప్‌లో తిరుపతి డబ్బులు ఇస్తుండంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని నుంచి పూర్తి వివరాలు సేకరించి కోర్టు ముందు హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: