పాకిస్థాన్ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కేసులో.. బిహార్ పోలీసులు అరెస్ట్ చేసిన మహమూద్ వివరాలను హైదరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారు. బిహార్ పోలీసులను సంప్రదించడంతో పాటు.. ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులతోనూ వివరాలు ఆరా తీస్తున్నారు. బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అహ్మద్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదియా నూర్‌తో పరిచయం ఏర్పడింది.
ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న అహ్మద్ఖా దియాను హైదరాబాద్ తీసుకురావాలనుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న తన అన్న మహమూద్‌కు తెలిపాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీని కోసం అహ్మద్‌తో పాటు సౌదీలో పనిచేస్తున్న జీవన్ అనే నేపాలీ వ్యక్తి సాయం చేస్తానన్నాడు. ఖాదియా నూర్ పాకిస్థాన్ నుంచి నేపాల్ చేరుకొని జీవన్‌ను కలిసింది.
అతను ఖాదియాను బిహార్ సరిహద్దులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం పోలీసులు తనిఖీ చేయగా.. ఖాదియా వద్ద నకిలీ ఆధార్ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా పాక్ యువతిగా తేలింది. బిహార్‌లో ఉన్న మహమూద్ సూచన మేరకు ఖాదియాను తీసుకొచ్చినట్లు జీవన్ పోలీసులకు తెలిపాడు. దీంతో మహమూద్‌ను సైతం పోలీసులు పట్టుకున్నారు. ఖాదియా నూర్, జీవన్, మహమూద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అహ్మద్‌కు ఖాదియాతో ఎప్పటి నుంచి పరిచయం ఉందనే విషయాలను హైదరాబాద్ పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.
ఇవీ చదవండి: నిండుకుండల్లా జలాశయాలు.. నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు
భారీ స్కామ్.. రూ.56కోట్ల క్యాష్, రూ.14కోట్ల ఆభరణాలు స్వాధీనం.. లెక్కించేందుకు 13 గంటలు!