కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఏస్పీ సత్యనారాయణ, సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ కుగ్రామానికి చెందిన నిందితుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఆమెతో విడిపోగా రెండో భార్య చనిపోయింది. మూడో సంబంధానికి ఓ కుమారుడు, కుమార్తె. భార్యకు మతిస్థిమితం లేదు. కుమార్తె (15)పై మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని కుటుంబంతో పరిచయం కొనసాగిస్తున్న నిందితుడి మొదటి భార్యకు బాధితురాలు ఫోన్ చేసి చెప్పింది. ఆమె సూచనతో డయల్ 100కు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి తండ్రిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు డీఏస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: