ETV Bharat / crime

ఒకడిగా మరణించి.. నలుగురిలో జీవిస్తున్నాడు... - organ donation in mahabubnagar district

తన భర్త.. మరణించినా.. నలుగురిలో బతుకుంటాడని ఆ వైద్యులు చెప్పిన మాటను ఆమె నమ్మింది. అవయవ దానం చేస్తే మరో నలుగురి ప్రాణాలు నిలబడతాయని చెబితే సరే అంది. జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త.. బ్రెయిన్​ డెడ్​ అయి నిర్జీవంగా పడి ఉండటం చూసిన ఆమె.. ధైర్యం కోల్పోకుండా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంగీకరించింది.

organ donation, mahabubnagar district
అవయవదానం, మహబూబ్​నగర్ జిల్లా
author img

By

Published : Apr 3, 2021, 9:14 AM IST

మహబూబ్​నగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన జాజిలి రాములు అనే వ్యక్తి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది కింద రాములుకు వివాహం జరిగింది. గత శనివారం అనారోగ్యానికి గురైన రాములును ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా హైదరాబాద్​కు తీసుకువెళ్లాలని సూచించారు.

హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు.. రాములు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల బ్రెయిన్​డెడ్ అయినట్లు నిర్ధరించారు. అతని అవయవాలు దానం చేస్తే నలుగురి ప్రాణాలు నిలబడతాయని రాములు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఎట్టకేలకు అవయవ దానానికి అతని కుటుంబం అంగీకరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.