హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 388 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వీరిలో 344 మంది అబ్బాయిలు, 44 మంది బాలికలున్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న 61 మందిపై కేసులు నమోదు చేశారు. బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి కల్పించిన పోలీసులు వారిలో 353 మందిని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అనాథలైన 25 మంది చిన్నారులను ఆశ్రమాల్లో చేర్పించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ కోసం 17 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎస్సైతో పాటు... 4 కానిస్టేబుల్లు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సైలు, కానిస్టేబుళ్లకు సీపీ అంజనీ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి : పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ హామీ ఏమైంది..?: జీవన్ రెడ్డి