ETV Bharat / crime

Online betting: ఆన్​లైన్​ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు.. 74లక్షలు స్వాధీనం - telangana varthalu

ఆన్‌లైన్‌లో క్యాసినో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠా ఎస్వోటీ మల్కాజిగిరి పోలీసులకు చిక్కింది. ముగ్గురు సభ్యుల ముఠా వద్ద నుంచి రూ.53 లక్షల నగదు, మూడు చరవాణులు, ఒక ట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా ముఠా గుట్టుగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని 21.82 లక్షల రూపాయలను స్తంభింపజేశారు.

Online betting: ఆన్​లైన్​ బెట్టింగ్​ ముఠా గుట్టు రట్టు.. 74లక్షలు స్వాధీనం

author img

By

Published : Oct 8, 2021, 5:48 PM IST

Updated : Oct 8, 2021, 10:03 PM IST

ఆన్‌లైన్‌లో చడీ చప్పుడు కాకుండా క్యాసినో బెట్టింగ్‌.. 2018 నుంచి యథేచ్ఛగా కార్యకలాపాలు... ఎక్కడ ఎదుటి వ్యక్తిని నేరుగా కలవకుండా... నగదు తీసుకోవడం దగ్గర నుంచి అంతా ఆన్‌లైన్‌లోనే... ఎట్టకేలకు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి ఇద్దరు బుకీలతో పాటు ఒక పంటర్‌ను రాచకొండ ఎస్వోటీ, నేరేడ్‌మెట్‌ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ముఠా కార్యకలాపాల గురించి అనేక విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్‌ తిరుమలగిరి ఎస్పీ కాలనీకి చెందిన చున్నం కిరణ్‌ 2003లో యూకే అక్కడ నుంచి శ్రీలంక వెళ్లాడు. అక్కడ కొంతకాలం వివిధ హోటళ్లలో పనిచేశాడు. ఆ తర్వాత క్యాసినో క్లబ్‌లో పరిశీలకుడిగా చేరాడు. అక్కడ క్యాసినో నిర్వాహణ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. యూకేలోని బెట్‌ఫెయిర్‌ డాట్‌ కామ్‌, బెట్‌ 365, 1ఎక్స్‌ బెట్‌ తదితర ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ల గురించి అవగాహన పెంచుకున్నాడు. బెట్టింగ్‌ ద్వారా సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏజెంట్​గా మారాడు. అయితే ఇందుకు బ్యాంకు ఖాతా అవసరం కావడంతో... బెంగళూరు కేంద్రంగా శ్రీనిధి సాఫ్ట్‌ బైట్‌ అనే డొల్ల సంస్థను సృష్టించాడు. బెంగళూరు ఇందిరానగర్‌ యాక్సిస్‌ బ్యాంకులో సంస్థ పేరుతో ఖాతా తెరిచాడు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహించడానికి 20 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి బెట్‌ ఫెయిర్‌లో ఖాతా తెరిచాడు. బెట్టింగ్‌ల ఆడే పంటర్ల వద్ద నుంచి నెట్‌ బ్యాంకింగ్‌ యాప్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు తీసుకునే వాడు. 70-30 నిష్పత్తిలో కమిషన్‌ ప్రాతిపదికన పంటర్‌లకు యూజర్‌ నేమ్‌ పాస్‌వర్డ్‌ అందించేవాడు. దాదాపు వెయ్యి మంది బాధితులు నిందితుడి ద్వారా బెట్టింగ్‌లు ఆడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఉద్యోగులను పెట్టుకుని మరీ..

నిషేధిత క్యాసినో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న కిరణ్‌తో పాటు అతని అనుచరుడు అక్విల్‌ అహ్మద్‌, పంటర్‌ సురేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నేపాల్‌కు చెందిన నలుగురు మహిళలను ఉద్యోగులుగా పెట్టుకొని మరీ కార్యకలాపాలు నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిందితులను కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా కేసు విచారిస్తామని పోలీసులు తెలిపారు.

ఆన్​లైన్​ బెట్టింగ్​ ముఠా గుట్టు రట్టు

ఈ ఐపీఎల్​ సీజన్​, ఇంకా వేరే స్పోర్ట్స్​, క్యాసినో ద్వారా బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశాం. మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. ముగ్గురిని ఈ కేసులో అరెస్టు చేసి.. వారి నుంచి 53లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్​లోని 21లక్షలను ఫ్రీజ్​ చేశాం. మొత్తం 74లక్షల 83వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితులు కిరణ్​, సాయితో పాటు సురేందర్​ను అరెస్టు చేశాం. బెట్​ 365, బెట్​ ఫెయిర్​, వన్​ ఎక్స్​ బెట్​, వరల్డ్​777 అనే యాప్స్​ ద్వారా ఆన్​లైన్​ వెబ్​సైట్స్​లో వాళ్లు బెట్టింగ్​ నిర్వహిస్తున్నారు. మెయిన్​ బెట్టింగ్​ కంపెనీ యూకేలో ఉంది. అక్కడి నుంచి కోడ్​ తీసుకుని ఈ బెట్టింగ్​ను నిర్వహిస్తారు. -మహేశ్‌ భగవత్‌, రాచకొండ సీపీ

బెట్టింగ్​ల ఉచ్ఛులో ఎవరూ చిక్కుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ తరహా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహించే వారిపై తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కన్న కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

Last Updated : Oct 8, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.