ETV Bharat / crime

న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులకు కస్టడీ - vamanrao couple murder case updates

Custody for the accused in the murder case of the lawyer couple
న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులకు కస్టడీ
author img

By

Published : Feb 24, 2021, 5:26 PM IST

Updated : Feb 24, 2021, 6:00 PM IST

17:24 February 24

న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులకు కస్టడీ

పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసు నిందితులను వారం రోజులపాటు పోలీస్​ కస్టడీకి ఇస్తూ మంథని కోర్టు తీర్పు ఇచ్చింది. 

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 19న సీన్​ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి ముగ్గురు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించింది. ఇదే కేసులో ఆయుధాలు, వాహనం సరఫరా చేసిన బిట్టు శ్రీనును.. కోర్టులో హాజరుపరిచగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.

ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ డీసీపీ రవీందర్​ మంథని కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అనుమతించిన కోర్టు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్​ను వారంపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.  

ఇవీచూడండి: 'మంథనిలో లీగల్‌ ఫ్యాక్షన్‌ నడుస్తోంది'

Last Updated : Feb 24, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.