యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ బద్దుతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తోన్న మోహన్ అనే వ్యక్తి లారీని వెనుకనుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
జిల్లాలోని కుంట తండాకు చెందిన మోహన్ హైదరాబాద్ నుంచి తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మల్కాపూర్ బద్దు తండా వద్దకు చేరుకోగానే అతని ముందు ప్రయాణిస్తోన్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వెనుక వస్తున్న మోహన్ లారీని బలంగా ఢీ కొట్టడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పదవీ విరమణ చేసిన 14ఏళ్లకు ఆమెకు పింఛన్!