భవన నిర్మాణం కోసం భారీ ఇనుప కడ్డీలను తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడడంతో ఒక వ్యక్తి మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన హైదరాబాద్లోని కొంపల్లిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కొంపల్లి ప్రాంతంలో నినీప్లాంట్ ఎదురుగా ఫెయిర్ అండ్ ఫీల్డ్ నిర్మాణ సంస్థ భారీ భవన నిర్మాణాన్ని చేపడుతోంది. సెల్లార్ కోసం కావాల్సిన ఇనుప కడ్డీలను తీసుకొస్తున్న క్రమంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలోని ఇద్దరు వ్యక్తులపై ఇనుప రాడ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఉపేందర్ అనే కార్మికుడు మృతి చెందగా మహేందర్ అనే వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులిద్దరూ జార్ఖండ్ చెందినవారిగా గుర్తించారు.
ఇదీ చదవండి: విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకొడుకు సజీవదహనం