మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఆరు గంటల సమయంలో డివైడర్‌పై నాటిన మొక్కలకు పారిశుద్ధ్య కార్మికులు నీళ్లు పోస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా తూప్రాన్ నుంచి నగరానికి రాంగ్ రూట్లో ఓ టిప్పర్ దూసుకొచ్చింది. ఆ వాహనం అదుపు తప్పి.. డివైడర్ ఎక్కి కార్మికులను ఢీకొట్టింది.
ఈ ఘటనలో దశరథ(48) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అతని శరీరం నుజ్జునుజ్జు అయ్యింది. మరో మహిళా కార్మికురాలికి తీవ్రగాయాలు కావడంతో.. ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చదవండి: తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. మృతదేహం లభ్యం