ETV Bharat / crime

ముగ్గురు ప్రాణ మిత్రులకు చేరువైంది.. చివరికి ఓ ప్రాణాన్ని బలిగొంది..! - చరవాణి కోసం కొట్లాట

ఎంతో స్నేహంగా ఉండే ముగ్గురు ప్రాణ మిత్రులకు తాను చేరువైంది. తాను వాళ్ల జీవితంలో ఆనందం నింపుతుంది అనుకుంటే.. అనుకోని గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. దాని ఫలితంగా ఆ స్నేహితుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి కాస్తా గొడవకు దారి తీశాయి. తనను వాళ్ల జీవితంలోకి తీసుకొచ్చిన స్నేహితున్ని.. మిగతా మిత్రులే చంపేసే పరిస్థితి వచ్చింది. దీనంతటికి కారణం.. తనే..! తను అంటే ఏ అమ్మాయో అనుకునేరు.. తనూ అంటే ఓ చరవాణి..!! మరి ఆ చరవాణి వల్ల మలుపు తిరిగిన ఓ స్నేహితుల కథ చదివేసేయండి..

one died in three friends in mobile conflict at vikarabad

author img

By

Published : Mar 10, 2022, 4:37 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూర్​లోని వడ్డెర ఢిల్లీకి చెందిన పింకు, మల్​రెడ్డిపల్లికి చెందిన టింకు, తాండూర్ మండలం అనంతారానికి చెందిన రింకు ముగ్గురు స్నేహితులు(మైనర్లు అయినందున పేర్లు మార్చబడినవి). పింకు, టింకు.. ఇద్దరు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రింకు మాత్రం చిన్నచిన్న పనులు చేసుకుంటుంటాడు. టింకు ద్వారా పింకూ​కు రింకు స్నేహితుడయ్యాడు. ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండే వారు. ముగ్గురు కలిసి తరచూ.. కళాశాల మైదానంలో కలుసుకుని కాలక్షేపం చేసేవారు.

అయితే.. వాళ్లు కలుసుకునే కళాశాల మైదానంలో సాయంత్రం పూట స్థానికులు వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ కోసం కొంతమంది ద్విచక్రవాహనాలపై వస్తుంటారు. వాహనదారులు వాళ్ల చరవాణులను బైక్​కు ఉన్న కవర్​లోనే పెట్టి వాకింగ్​, వ్యాయామ కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. రోజూ అక్కడే కాలక్షేపం చేసే ఈ ముగ్గురు స్నేహితులు.. ఈ విషయాన్ని గమనించారు. ఓ రోజు ముగ్గురు స్నేహితులు ఓ ప్లాన్​ వేసుకున్నారు. ద్విచక్రవాహనాల దగ్గరికి వెళ్లారు. అక్కడున్న బైక్​లను చెక్​ చేశారు. వీళ్ల ముగ్గరిలో పింకూకు ఓ బైక్​ కవర్లో సెల్​ఫోన్ దొరికింది. వెంటనే దాన్ని తీసుకుని.. మిగతా ఇద్దరితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సెల్​ఫోన్​కు లాక్ ఉండటం వల్ల దాన్ని ఓపెన్ చేయడానికి వీలుకాలేదు. రిపేర్​ సెంటర్లో ఇస్తే.. ఏదైనా ఫలితం ఉంటుందేమోనని తలచారు. వెంటనే మొబైల్​ను తీసుకుని టింకు, రింకు కలిసి పట్టణంలోని మొబైల్ దుకాణానికి వెళ్లారు. సెల్​ఫోన్​ని అన్​లాక్​ చేయమని అడిగారు. వాళ్లను, మొబైల్​ను చూసిన ఆ దుకాణం నిర్వాహకునికి అనుమానం వచ్చింది. ఈ ఫోన్​ ఎక్కడి నుంచి తీసుకువచ్చారని వారిని నిలదీశాడు. దొంగతనం చేశారా..? అని ప్రశ్నించాడు. తటపటాయింటంతో.. ఇద్దరిపై చేయి చేసుకున్నాడు. అన్​లాక్​ చేయమని ఇచ్చిన ఫోన్​తో పాటు వాళ్ల దగ్గరున్న రెండు చరవాణులకు కూడా తీసుకున్నాడు. ఈ ఫోన్ ఎవరిచ్చారో వాళ్లను తీసుకుని వస్తేనే.. మీ ఫోన్లు ఇస్తానని.. పంపించేశాడు.

ఈ అనుకోని ఘటనతో టింకు​, రింకు కంగుతిన్నారు. దీనంతటికి కారణమైన.. పింకు మీద ఇద్దరికి కోపం వచ్చింది. "నీవల్లే మా ఫోన్లు కూడా పోయాయి." అంటూ పింకు​తో వాగ్వాదం పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. పింకును తీసుకుని ద్విచక్రవాహనంపై బుధవారం(మార్చి 9) సాయంత్రం పట్టణ శివారులోని భూకైలాస్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గొల్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు మళ్లీ గొడవ పడ్డారు. కోపోద్రిక్తులైన టింకు, రింకు కలిసి పింకు​ను కొట్టారు. ఈ క్రమంలో కిందపడ్డ పింకు​ తలపై బండరాయితో మోదారు. తీవ్రంగా గాయపడ్డ పింకు​ ప్రాణాలు విడిచాడు. చనిపోయాడని నిర్ధరించుకుని.. ఏమీ తెలియనట్టుగానే ఇద్దరు కలిసి పట్టణానికి చేరుకున్నారు.

అప్పటికైతే ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ.. స్నేహితున్ని చంపేశామన్న భయం మాత్రం వాళ్లను వెంటాడింది. అదే భయంతో ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు. వాళ్లిద్దరు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పింకు​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.