ETV Bharat / crime

Accident : అదుపుతప్పి కిందపడిన బైక్.. ఒకరు మృతి - accident in adilabad district

లాక్​డౌన్ సమయం మొదలవకముందే ఇంటికి చేరుకోవాలని ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న దంపతులు అదుపుతప్పి కిందపడిపోయారు. ఆదిలాబాద్ నేరడిగొండ మండలం మామడ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

adilabad accident, bike accident at mamada
ఆదిలాబాద్ వార్తలు, ఆదిలాబాద్​లో రోడ్డు ప్రమాదం, మామడలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 30, 2021, 1:42 PM IST

లాక్​డౌన్ మినహాయింపు సమయానికి ముందే ఇంటికి చేరుకోవాలని ద్విచక్రవాహనంపై వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్ మామడ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్జాపూర్ గ్రామానికి చెందిన ఊషన్న, లింగమ్మ దంపతులు ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్​లో శనివారం.. జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. అప్పటికే లాక్​డౌన్ సమయం మించిపోవడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నారు.

మరుసటి రోజు ఉదయమే వాఘాపూర్ నుంచి బయలుదేరిన ఆ జంట.. ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో రోల్ మామడ వద్ద కింద పడ్డారు. వెనకాల ఉన్న లింగమ్మ తలకు తీవ్ర గాయాలవడం వల్ల ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఊషన్న స్వల్ప గాయాలతో బయట పడ్డారు. అతన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.