ETV Bharat / crime

Cheating: కోటి రూపాయలతో వ్యక్తి పరార్.. బాధితుల గగ్గోలు - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

అప్పు ఇస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇస్తానంటూ నమ్మించి కోటీ రూపాయలతో పరారయ్యాడు ఓ వ్యక్తి. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

cheating
కోటి రూపాయలతో వ్యక్తి పరార్
author img

By

Published : Jul 6, 2021, 9:44 AM IST

అధిక వడ్డీ పేరుతో దాదాపు కోటి రూపాయలు కుచ్చుటోపీ పెట్టి ఓ వ్యక్తి పరారైన సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్వతి నగర్​లోని శ్రీ గురు ఫైనాన్​లో పనిచేస్తున్న శ్రీనివాసులు అధిక వడ్డీ ఇస్తానని చెప్పాడు. కొంత కాలంగా అవసరాల కోసం డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం లాంటి లావాదేవీలు చేస్తూ వచ్చాడు. ఇలా దాదాపు పట్టణంలోని కొందరి వద్ద కోటీ రూపాయలు అప్పులు చేశాడు. కొన్ని రోజుల నుంచి డబ్బులు తిరిగి చెల్లించకపోగా.. తాజాగా ఇంటి నుంచి కుటుంబంతో సహా ఉడాయించాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో తమ దగ్గరున్న డబ్బు అంతా ఇచ్చేశామని... శ్రీనివాసులు ఇలా చేస్తాడని ఊహించలేదని వాపోయారు. నిందితుడి నుంచి తమ డబ్బు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అబద్ధాలు చెప్పి అప్పులు..

ఇంటి నిర్మాణం కోసమంటూ కొందరి వద్ద, కుమారుని ఉద్యోగం కోసమంటూ చెప్పి మరి కొంతమంది దగ్గర దాదాపు కోటి రూపాయల వరకు అప్పులు చేశాడు. కొందరి వద్ద ఏకంగా ఇంటి పత్రాలను కలర్ జిరాక్స్ చేసి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మరి కొందరికి ప్రామిసరీ నోటు రాసిచ్చి అప్పు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసమంటూ పట్టణంలోని సుశీలమ్మ వద్ద రూ.3.80లక్షలు తీసుకున్నాడు. కుమారుని ఉద్యోగం కోసమంటూ శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు తీసుకుని... ఇలా దాదాపు 50 నుంచి 60 మంది వద్ద సుమారు కోటి రూపాయలు అప్పులు చేసి పరారయ్యాడు.

ఇల్లు అమ్మి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ఉడాయింపు ..

అప్పు తీసుకున్న వారికి నమ్మకం కలిగించేలా కొన్ని రోజులు అప్పులు తీసుకున్న వారికి సక్రమంగా వడ్డీ చెల్లించాడు. అనంతరం అప్పులు ఎక్కువయ్యాయని.. ఇల్లు అమ్ముతున్నట్లు వెల్లడించాడు. జూలై 1వ తేదీన అప్పులు తీసుకున్న వారందరికీ అప్పులు తీర్చేస్తానని నమ్మబలికాడు. జూన్ 29వ తేదీన కుటుంబ సమేతంగా పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు కల్పించుకుని తమ డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు తెలుసుకుని దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని.. న్యాయం చేస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

హైవేపై తగలబడిన ట్రక్కులు-డ్రైవర్​ మృతి

Vaccine: గర్భిణికి టీకా అభయం.. అపోహవీడి తీసుకోవడమే నయం

చిరుసంస్థలపై ఉరుము లేని పిడుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.