ETV Bharat / crime

ఏటీఎం వద్ద కాల్పుల కేసులో ఒకరు అరెస్ట్​.. ఇంకొకరు పరార్​! - తెలంగాణ నేరవార్తలు

కూకట్​పల్లి హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం వద్ద కాల్పులు జరిపి రూ. 5 లక్షలు కాజేసిన కేసులో.. ఒకరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు.

kukatpally atm theft
కూకట్​పల్లి హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం వద్ద కాల్పులు
author img

By

Published : May 1, 2021, 11:01 AM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి హెచ్‌డీఎఫ్​సీ ఏటీఎం వద్ద పట్టపగలు కాల్పులకు తెగబడి రూ.5 లక్షలు దోచుకెళ్లిన కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడ్డ నిందితుల్లో ఒకడిని ఇప్పటికే అరెస్ట్​ చేశారు. అతనిచ్చిన సమాచారంతో రెండో నిందితుని కోసం ప్రయత్నించగా త్రుటిలో తప్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తొలుత పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు అనుమానితులని పోలీసులు తేల్చారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా..

గురువారం పట్టపగలు.. ఇద్దరు ఆగంతకులు జరిపిన దాడిలో ఆలీబయాగ్ అనే సెక్యూరిటీ గార్డు మృతి చెందగా, శ్రీనివాస్ అనే కస్టోడియన్​ గాయపడ్డాడు. ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. కాల్పుల అనంతరం నిందితులు జేఎన్‌టీయూ, మియాపూర్ చౌరస్తా, బాచుపల్లి, ఐడీఏ బొల్లారం మీదుగా సంగారెడ్డి వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు.

అదే ధైర్యంతో..

ఘటన జరిగిన రోజు మద్యాహ్నం 1.45 గంటలకు ఏటీఎంలో డబ్బులు నింపడానికి ' రైటర్ సేఫ్ గార్డు ' వాహనం అక్కడికొచ్చింది. 1.50 గంటల తర్వాత సిబ్బంది లోపలికెళ్లారు. అయితే ఈ అయిదు నిమిషాల వ్యవధిలోనే దోపిడి చేసేందుకు ఇది అనువైనా సమయమా ... కాదా.. అంటూ దుండగులు పల్సర్​ వాహనంపై మూడు సార్లు రెక్కీ నిర్వహించారు. పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించి పారిపోయేందుకు కేపీహెబీ జాతీయ రహదారిని ఎంచుకున్నట్లు గుర్తించారు. ఘటనకు ముందు ఏటీఎం లోపల ఏం జరుగుతుందో కనిపించకుండా సిబ్బంది వాహనాన్ని అడ్డుగా పెట్టడంతో ధైర్యంగా లోపలికి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇంత దాడికి తెగబడతారా..

సాధారణంగా నాటు తుపాకీలను అంతరాష్ట్ర ముఠాలే వినియోగిస్తుంటాయి. అయితే కేవలం రూ.5 లక్షల కోసమే ఇంత దాడికి తెగబడతారా అని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేయగా ఆసలు సంగతి బయటపడింది. ఈ ఇద్దరు ఆగంతుకులు బేగంపేటలోని ఏజెన్సీ కార్యాలయం దగ్గరే మకాం వేశారని... ఆ క్రమంలో భారీ సంఖ్యలో బాక్సులను వాహనంలోకి ఎక్కిస్తుండటాన్ని గమనించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచే వాహనాన్ని అనుసరించి ఉంటారని అంచనా వేస్తున్నారు. తొలుత భాగ్యనగర్ కాలనీలో ఓ ఏటీఎంలో డబ్బులు నింపి వచ్చిన వాహనం ఆ తర్వాత ఘటన జరిగిన ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చింది.

' రైటర్ సేఫ్ గార్డు ' క్యాష్ మేనేజ్​మెంట్​ సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద బయలుదేరినప్పుడు ఈ వాహనంలో రూ. 2.07 కోట్లు ఉన్నట్లు సంబంధిత అధికారులు పోలీసుల దృష్టికి తెచ్చారు. ఘటనా స్థలంలో గాయపడ్డ శ్రీనివాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత డిశ్చార్జి చేసినట్లు వివరించారు

కూకట్​పల్లి హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం వద్ద కాల్పులు

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.