ఉపాధి పథకం పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో (Road accident).. ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన చెందిన ముగ్గురు కూలీలు ద్విచక్రవాహనంపై నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ గ్రామానికి ఉపాధి పని కోసం వెళ్తున్నారు. నిర్మల్ నుంచి ఖానాపూర్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలు కాగా.. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదగని గంగవ్వ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.