ETV Bharat / crime

అర్ధరాత్రి తాతను చంపేసిన మనవళ్లు.. ఆస్తి కోసమేనా?

ఆస్తి కోసం అమానుషంగా ప్రవర్తిస్తూ హత్యలు చేయడానికి కుడా వెనుకాడడం లేదు రక్త సంబంధీకులు. కన్నకొడుకు కాదన్నా.. కూతుళ్లు కంటికి రెప్పలా చూస్తున్నారన్న కక్షతో 85 ఏళ్ల వృద్ధుడిని చంపేశారు. ఆస్తి కోసం అత్యంత కిరాతకంగా నిద్రలో ఉన్న వృద్ధుడిని నాటు తుపాకీతో కాల్చి మరీ కడతేర్చారు మనవళ్లు.

old man killed by grandsons, murder for assets
ఆస్తి కోసం తాతను చంపిన మనవళ్లు, ఆస్తి కోసం హత్య
author img

By

Published : Apr 27, 2021, 2:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాళి పంచాయతీ చికిడిగాం గ్రామంలో ఓ వృద్ధుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. ఆస్తి గొడవల కారణంగా వృద్ధుడి మనవళ్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. మందస పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చికిడిగాం గ్రామంలో నివసిస్తున్న పారిగ కమలో(85)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈయనకు నాలుగు ఎకరాల పల్లం, మూడెకరాల మెట్ట భూమి ఉంది. ఈ ఆస్తి విషయంలో కమలోకు ఆయన కుమారుడు పారిగ రమ్మోకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కుమారుడు సక్రమంగా చూడలేదనే ఆరోపణలతో కమలో తన చిన్న కుమార్తె శకుంతల వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్నాడు.

ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న కుమార్తె, మనుమరాలికి తుపాకీ పేలిన శబ్దం వినబడింది. ఉలిక్కి పడిలేచిన ఇద్దరూ ఇంటి లోపలకు వెళ్లి చూడగా కమలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్‌, మందస ఎస్‌ఐ బి.రామారావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా ఆస్తి వివాదమే హత్యకు కారణమని, మనవళ్లే (కుమారుడి బిడ్డలు) తాతను తుపాకీతో కాల్చి పరారవుతుండగా చూశానని మనుమరాలు సీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం నిందితులు తిరిగిన ప్రాంతాలను పరిశీలించింది. ఘటనాస్థలంలో లభ్యమైన తూటాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: దారుణం: మహిళను హతమార్చి.. శరీర భాగాలు వేరు చేసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.