వనపర్తి జిల్లాలో విషాదం జరిగింది. రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో మట్టిమిద్దె కూలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ, ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను స్థానికులు వెలికితీశారు.
పాకల గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు. చిన్నకొడుకు కుమారుడితో కలిసి రాత్రి భోజనం ముగించుకుంది. లక్ష్మమ్మ.. మనవడు కలిసి ఆమె పాత ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. హఠాత్తుగా మట్టిమిద్దె కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: Lockdown: లాక్‌డౌన్ ఉల్లంఘనులపై పోలీసుల మల్లగుల్లాలు