Jeedimetla minor girl death case : హైదరాబాద్లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక(17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు అక్కడున్న కాపలాదారు సోమవారం అర్ధరాత్రి గుర్తించాడు. అదే రోజు ఆమె 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది.
Jeedimetla minor girl death case Updates : జీడిమెట్లలోని సుభాశ్‌నగర్ పైపులైన్ రోడ్డులో బాలిక కుటుంబం నివాసముంటోంది. ఆమె ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకొంది. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి కిరాణా దుకాణానికి వెళ్లేందుకు వచ్చినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. గడప దాటినప్పటి నుంచి ఘటన జరిగిన భవనం వరకు ఒంటరిగా వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో కన్పిస్తోంది. ఆమె ఆ భవనంలోకే ఎందుకు వెళ్లిందనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ 3 గంటలు ఏం జరిగిందనేది తెలియడంలేదు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, పోలీసు జాగిలాలతో జల్లెడ పట్టినా బలమైన ఆధారాలు దొరకలేదు. భవన కాపలాదారుతోపాటు ఆమె ఇంటి పక్కన ఉన్న పలువుర్ని విచారించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు విచారణకు సహకరించడం లేదని ఓ పోలీసు అధికారి చెప్పారు. పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.. దాని ఆధారంగా హత్యా, ఆత్మహత్యా అనేది తేలనుంది.
ఇవీ చూడండి: