Road Accident In Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం అసన్‌పల్లి గేట్ సమీపంలో టాటా ఏస్‌ను లారీ ఢీకొట్టింది. టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 25 మందిలో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిట్లం మండలం చిల్లర్గి నుంచి టాటా ఏస్‌లో 25మంది ఎల్లారెడ్డి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డ్రైవర్ వాహనం వేగంగా నడపటంతో... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆటోను ఢీకొన్న తర్వాత లారీ పక్కన ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలంలో డ్రైవర్ సాయిలు, లచ్చవ్వ అక్కడిక్కడే చనిపోయారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ అంజవ్వ, వీరమణి, సాయవ్వ, వీరవ్వ, గంగామణి మరణించారు. బాన్సువాడ ఆస్పత్రి నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా ఎల్లయ్య, పోచయ్య మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.
చిల్లర్గి గ్రామానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి గురువారం చనిపోయాడు. అతడి దశదిన కర్మ అనంతరం ఆ కుటుంబాన్ని సంతకు తీసుకెళ్లి వివిధ ధాన్యాలను చేతులతో ముట్టిస్తారు. వివిధ ఆహార పదార్థాలు తినిపించి... కల్లు తాగించి తీసుకురావడం ఆచారంగా పాటిస్తారు. ఈ క్రమంలో మాణిక్యం కుటుంబాన్ని... బంధువులు, కులస్తులు ఎల్లారెడ్డికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది చనిపోవడం ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. నిర్లక్ష్యం, అతివేగం డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి : స్విగ్గీలో కాఫీ ఆర్డర్.. బద్దకంతో డెలివరీ బాయ్ 'స్మార్ట్ ప్లాన్'!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం