ETV Bharat / crime

సైబర్​ నయా మోసం: "హలో.. మేము హెల్త్​ డిపార్ట్​మెంట్​ నుంచి కాల్​ చేస్తున్నాం.." - ఉప్పల్​లో కొత్తరకం సైబర్​క్రైం మోసం

హైదరాబాద్​లో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త కొత్త దారుల్లో దోచేస్తున్నారు. ప్రజల కష్టాలను, అవసరాలను ఆసరాగా చేసుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఉప్పల్​లో ఉంటున్న ఓ యువకుడికి హెల్త్​ డిపార్ట్​మెంట్​నుంచి కాల్​ చేస్తున్నామని చెప్పి ఖాతాలో లక్షరూపాయలు కాజేశారు.

సైబర్​క్రైం వార్తలు
హైదరాాబాద్​ వార్తలు
author img

By

Published : May 6, 2021, 8:44 PM IST

"హలో... మాట్లాడేది నవీన్​నా.. మేము హెల్త్​ డిపార్ట్​మెంటు నుంచి మాట్లాడుతున్నాం.. మీ నంబరు పుల్లారావు అనే వ్యక్తి ఇచ్చాడు. మీ ఫోన్​పే నంబర్​కు ఓ లింక్​ వచ్చింది.. దానిపై క్లిక్​ చేసి పిన్​ నంబర్​ ఎంటర్​ చేయండి." ఇలా పదిసార్లు రిక్వెస్టు పంపారు... పదిసార్లు నవీన్​ పిన్​ నంబర్​ ఎంటర్​ చేశాడు. పదకొండోసారి అనుమానమొచ్చి తన ఖాతా చూడగా అప్పటికే లక్షమాయమయ్యిందని గ్రహించిన బాధితుడు సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్​లో కొత్తరకం సైబర్​ మోసం బయటపడింది. తన ఖాతాలో లక్ష రూపాయాలు ఖాళీ చేశారంటూ హైదరాబాద్​ చింతల్​కు చెందిన నవీన్​.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే...

చింతల్​లో ఉంటున్న నవీన్​ మేనమామ పుల్లారావు ఏపీలోని గుంటూరులో హెడ్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న పుల్లారావు... నవీన్​కు ఫోన్​ చేసి ప్రభుత్వం నుంచి రూ.35వేలు నగదు వస్తుందని... అవి ఫోన్​పేలో జమ అవుతాయని చెప్పాడు. కొద్దిసేపటికే నవీన్​కు ఓ ఫోన్​ వచ్చింది. హెల్త్​ డిపార్ట్​మెంట్​నుంచి కాల్​ చేస్తున్నామని... తాము పంపిన లింకుపై క్లిక్​ చేయమని చెప్పి ఖాతాలోంచి లక్ష రూపాయలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి: ఐసోలేషన్‌ కేంద్రంలో 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.