ETV Bharat / crime

Nalgonda man dies in america :అమెరికాలో తెలంగాణ యువకుడు దుర్మరణం - తెలంగాణ తాజా వార్తలు

ఉద్యోగానికి రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నల్గొండ యువకుడు మృతి చెందాడు (Nalgonda man dies in america). అమెరికాలోని ఎల్లికాట్​ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

sekhar
sekhar
author img

By

Published : Nov 22, 2021, 3:24 PM IST

Updated : Nov 22, 2021, 8:44 PM IST

అమెరికాలోని ఎల్లికాట్​ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు (Nalgonda man dies in america). ఈనెల 19న జరిగిన ప్రమాదంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెంకు చెందిన మండలి శేఖర్​ (28) మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి వెళ్లిన కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. మృతుడు శేఖర్​.. అమెరికాలో హాస్పిటాలిటీ టూరిజంలో మాస్టర్​ డిగ్రీ చేసి.. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించినట్లు బంధువులు సమాచారం ఇచ్చారు.

మృతుడు శేఖర్​
మృతుడు శేఖర్​

శేఖర్​ మరణ వార్త తెలిసి గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన కుమారుడి.. అకాల మరణంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతునికి సోదరుడు, నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. శేఖర్​ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: vikarabad road accident today: విద్యార్థులతో వెళ్తున్న వాహనం బోల్తా.. 8 మందికి గాయాలు

Last Updated : Nov 22, 2021, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.