ETV Bharat / crime

డ్రగ్స్​ కేసులో కీలక నిందితులు అరెస్టు.. కొకైన్​ స్వాధీనం

Myron Mohit arrested in drug case: మాదక ద్రవ్యాల కేసులో మరో కీలక నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్విన్ న్యూన్స్​తో సంబంధమున్న మైరాన్ మోహిత్ సహా మరో వ్యక్తికి అరెస్ట్ చేశారు. అరెస్టైన మైరాన్ మోహిత్.. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో డీజే ఈవెంట్లు నిర్వహిస్తు మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గోవా నుంచి హైదరాబాద్ రాగా పక్కా సమాచారంతో జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఎడ్విన్‌ న్యూన్స్​తో సంబంధమున్న మరో నిందితుడు కృష్ణ కిషోర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

drug case
drug case
author img

By

Published : Jan 2, 2023, 9:45 PM IST

Myron Mohit arrested in drug case: రాంగోపాల్​పేట్ పీఎస్‌ పరిధిలో నవంబర్ 11 నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. డ్రగ్స్ కేసులో కీలక నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారు. రాంగోపాల్ పేట పరిధిలో గర్వ్ హరీష్ బెలనీ అనే వ్యక్తి 4.5 గ్రాముల ఎండీఎంఏతో పోలీసులకు పట్టుబడగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్ న్యూన్స్, బాల మురుగన్ పేర్లు బయటకు వచ్చాయి. పక్కా ప్రయత్నాలతో వీరిని గోవాలో అరెస్ట్‌ చేసిన హైదరాబాద్ నార్కొటిక్స్ వింగ్ పోలీసులు.. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో నిందితుడు మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్​పై దృష్టి పెట్టారు.

డ్రగ్స్​ సరఫరాదారులతో మోహిత్​కు లీంకులు:​ డీజే ఈవెంట్లు నిర్వహించి మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్న మోహిత్‌ కోసం గోవాలో 10 రోజుల పాటు ప్రత్యేక బృందం రెక్కీ నిర్వహించినా పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. కొత్త సంవత్సర వేడుకల వేళ.. మోహితే హైదరాబాద్‌ వచ్చినట్లు గుర్తించిన రాంగోపాల్‌ పేట, నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ పోలీసులు.. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి గ్రాము కొకైన్, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా అతని చరవాణి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 50మందికి పైగా సరఫరాదార్లతో మోహిత్‌కు లింకులు ఉన్నట్లు గుర్తించారు.

పార్టీలు నిర్వహిస్తూ కొకైన్​కు బానిసగా మారిన మోహిత్ పలువురికి డ్రగ్స సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గోవాలో డ్రగ్ కింగ్ పిన్‌గా ఎదిగిన ఎడ్విన్ న్యూన్స్ లింకులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని విచారిస్తే చివరకు ఎడ్విన్ పేరే వినిపిస్తోంది. తాజాగా మోహిత్ తో పాటు మన్యం క్రిష్ణ కిషోర్ రెడ్డి అనే వ్యాపార వేత్తను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి ఎడ్విన్ కామన్ ఫ్రెండ్​గా ఉన్నాడు. చరవాణిలో అతని కాంటాక్ట్​ను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో కేఎంసీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను నడుపుతున్న మన్యం క్రిష్ణ కిషోర్ రెడ్డి.. తరచూ పబ్బుల్లో స్నేహితులకు పార్టీలు ఇస్తుంటాడు.

Krishna Kishore arrested in drug case: ఇదే క్రమంలో డ్రగ్స్‌కు బానిసైనట్లు పోలీసులు గుర్తించారు. మాదక ద్రవ్యాల కోసం తరచూ గోవా వెళ్లి వస్తున్న కిషోర్ రెడ్డికి అక్కడ ఎడ్విన్ న్యూన్స్​తో కూడా పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడ్విన్​తో సంబంధం ఉన్న మరో వ్యక్తి బెంగళూరులో కిషోర్‌ రెడ్డికి పరిచయం అయ్యాడు. కిషోర్ రెడ్డికి అవసరం ఉన్నప్పుడల్లా బస్సుల ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్​కు అతను డ్రగ్స్​ను తీసుకొస్తున్నాడు. దీనికి సంబంధించిన డబ్బును గూగూల్​పే ద్వారా కృష్ణ కిషోర్ పంపుతున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

Supply cocaine in Hyderabad: పక్కా సమాచారంతో ఆదివారం బంజారాహిల్స్‌లోని అతని నివాసంలో కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 2గ్రాములు కొకైన్, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని గత రాత్రే రిమాండ్‌కు తరలించిన పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేలా ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిషన్ దాఖలు చేశారు. వీరిని విచారిస్తే ఎడ్విన్​తో పాటు డ్రగ్స్​తో సంబంధాలున్న మరికొందరి పేర్లు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

డ్రగ్స్​కేసులో కీలక నిందితులు అరెస్టు.. కొకైన్​ స్వాధీనం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.