ETV Bharat / crime

దారి దోపిడీ.. ఎంపీ నామ కుమారుడిని కత్తితో బెదిరించి.. - MP Nama son was robbed in tolichowki

MP Nama's son was robbed : తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీపై దారి దోపిడీ దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ టోలిచౌకి వద్ద అతడి వాహనాన్ని ఆపి అందులో ఎక్కారు. కత్తితో బెదిరించి అతని బ్యాంక్ ఖాతా నుంచి 75వేలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకుని దిగిపోయారు.

MP Nama's son was robbed
MP Nama's son was robbed
author img

By

Published : Aug 2, 2022, 12:27 PM IST

Updated : Aug 2, 2022, 12:45 PM IST

MP Nama's son was robbed : తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీ దారి దోపిడీకి గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద ఇద్దరు దుండగులు పృథ్వీ వాహనాన్ని ఆపి ఎక్కారు. టోలిచౌకి నుంచి పంజాగుట్ట వరకు వాహనంలోనే తిరిగారు. అనంతరం పృథ్వీని కత్తితో బెదిరించి అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.75వేలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని వాహనం దిగిపోయారు. దీనిపై పృథ్వీ ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MP Nama son was robbed
దారి దోపిడీ.. ఎంపీ నామ కుమారుడిని కత్తితో బెదిరించి..

'టోలిచౌకి వద్ద తన కారు ఆపి దోపిడీ చేశారని జులై 30న పృథ్వీతేజ ఫిర్యాదు చేశారు. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని కారును అడ్డుకుని బలవంతంగా కారులోకి ఎక్కారు. అతణ్ని కత్తితో బెదిరించి రూ.75వేలు ఫోన్‌పే ద్వారా వారి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. ఒకేసారి ఆయా ప్రాంతాల్లో కారులో మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. మొత్తం వాహనంలో పృథ్వీతో సహా ఆరుగురు ఉన్నారు. టోలిచౌకి నుంచి గచ్చిబౌలి, కొండాపూర్, ఖైరతాబాద్, ఎస్సార్‌ నగర్ నుంచి పంజాగుట్ట చేరుకున్నారు. పంజాగుట్టకు రాగానే వారు అతణ్ని వదిలిపెట్టి పరారయ్యారు. వెంటనే పృథ్వీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నాం. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాం. కారు హై రేంజ్ అని గమనించి దోపిడీ చేయొచ్చని భావించి ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది.' అని పంజాగుట్ట సీఐ హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు.

Last Updated : Aug 2, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.