ETV Bharat / crime

డ్రగ్స్​ దందాలో కొత్త పంథా.. పక్క రాష్ట్రాల్లో మత్తు​ పార్టీలు - drygs parties in goa

Drugs parties in other states: మత్తు పదార్థాలను అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసులు నిఘా పెంచడంతో కొందరు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. మరికొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మత్తుపార్టీలో మునిగితేలుతున్నారు. ఈ సంస్కృతి ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతోంది. వీటికి డిమాండు పెరుగుతుండటంతో ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేసే ముఠాలు కూడా పెరుగుతున్నాయి. మత్తుమందుల కారణంగా హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు మరణించిన నేపథ్యంలో మత్తుపార్టీల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మరణించిన యువకుడి మిత్రబృందం గోవాలో జరిగిన పార్టీకి వెళ్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదొక్కటే కాదు. ఇటీవలి కాలంలో ఇలాంటి పార్టీలు షరా మామూలయ్యాయి.

drugs parties in oher states, drugs in goa
ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్​ పార్టీలు, గోవాలో డ్రగ్స్​ దందా
author img

By

Published : Apr 1, 2022, 7:00 AM IST

Drugs parties in other states: సిగరెట్, ఆల్కహాల్, గంజాయి మరింత కిక్ కోసం ఎల్.ఎస్.డీ, ఎండీఎంఏ, హెరాయిన్ వంటి మత్తుపదార్థాలు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. స్నేహితులతో సరదాగా మొదలైన అలవాటు లక్షలాది మందిని బానిసలుగా మార్చేస్తోంది. మహానగరంలో మాదకద్రవ్యాలపై రోజురోజుకూ వెలుగుచూస్తున్న కొత్తకోణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ పిల్లలు బుద్ధిగా పాఠశాల, కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారని భావించే తల్లిదండ్రులకు.. మీ అబ్బాయి గంజాయి, ఎల్.ఎస్.డీ వాడుతున్నాడంటూ అకస్మాత్తుగా పోలీసుల నుంచి ఫోన్ కాల్ రాగానే ఉలికిపాటుకు గురవుతున్నారు. అప్పటికి గానీ కన్నబిడ్డలు తప్పటడుగులు వేస్తున్నట్టు గుర్తించలేకపోతున్నారు.

వినియోగదారులే విక్రేతలు: నగరంలో మత్తుకు అలవాటుపడిన ఒక్కో యువకుడు మరో 10-15 మందికి దాన్ని దగ్గర చేస్తున్నాడు. మాదకద్రవ్యాలు విక్రయించే ఒక్కొకరు సగటు 30-40 మందిని వినియోగదారులుగా మార్చుకుంటున్నారు. ఇది నగరానికి చెందిన ఓ ప్రముఖ స్వచ్చంద సంస్థ అధ్యయనంలో గుర్తించిన విస్మయం కలిగించే వాస్తవం. వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులు, స్నేహితుల ప్రభావం యువతను తేలికగా మాదకద్రవ్యాలకు దగ్గర చేస్తుందని ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ సూపరింటిండెంట్ నవీన్ కుమార్ తెలిపారు. జీవితంలో దారితప్పి అక్రమమార్గంలో నడుస్తున్న వ్యక్తులే మత్తుపదార్థాల విక్రేతలుగా మారుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మత్తుకు బానిసై: పగలు, రాత్రి తేడా లేకుండా విందులు, వినోదాలు, పబ్​లు, ఫామ్ హౌస్​లు, రిసార్టులు, హోటళ్లు సందడికి వేదికవుతున్నాయి. వయోభేదం లేకుండా పార్టీ సంస్కృతికి దగ్గరవుతున్నారు. అంతకు మించిన అనుభూతిని ఆస్వాదించేందుకు యువకులు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. సిగరెట్, మద్యం రుచి చూశాక ఎక్కువ సమయం మైకంలో ఉండేందుకు గంజాయికి దగ్గరవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 15-21 సంవత్సరాలలోపు విద్యార్థులు.. మిత్రుల ప్రభావంతో వీటికి తేలికగా దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 10,000- 15,000 మంది గంజాయి, ఎల్.ఎస్.డీ వాడుతున్నట్లు ఐదేళ్ల క్రితం అబ్కారీశాఖ అంచనా చేసింది. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షల్లోకి చేరి ఉండవచ్చని అబ్కారీశాఖకు కొందరు అధికారులు అంచనా వేస్తున్నారు.

మత్తుపార్టీల కోసం పరాయి రాష్ట్రాలకు వెళ్లడం కొత్త కాదు. కానీ ఇటీవలి కాలంలో అది కాస్త పెరిగిపోయింది. గతేడాది బెంగళూరు పోలీసులు మత్తుమందుల కేసులో ఆఫ్రికా దేశస్తుడిని అరెస్టు చేసినప్పుడు మత్తుపార్టీల వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే..! కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు వారాంతాల్లో ఇచ్చే మత్తుపార్టీలకు హైదరాబాద్ నుంచి అనేక మంది వెళ్లేవారని, అందులో స్థిరాస్తి వ్యాపారులతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తేలడం అప్పట్లో పెనుదుమారమే రేపింది. ఖరీదైన హోటళ్లలో జరిగే ఈ పార్టీల కోసం శనివారమే బెంగళూరు చేరుకునేవారని, రెండు రోజులు మత్తులో మునిగి తేలిన తర్వాత సోమవారం మళ్లీ హైదరాబాద్ వచ్చేవారని వెల్లడయింది.

దళారుల దందా: మత్తుపార్టీల కోసం గోవా వెళ్లడం సర్వసాధారణంగా మారిపోయింది. హైదరాబాద్​కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధులు, సాఫ్ట్​వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు కూడా గోవా పార్టీలకు క్రమం తప్పకుండా వెళ్తుంటారు. గోవా మత్తుపార్టీలకు చాలా డిమాండ్​ ఉంటుంది. ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేసే దళారులు తమ ఖాతాదారులకు గోవాలో ఎక్కడ కలవాలో చెబుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత తామే రవాణా ఏర్పాట్లు చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళతారు. అక్కడే కోరిన మత్తుమందు అందిస్తారు. తీసుకునే మత్తుమందును బట్టి డబ్బు వసూలు చేస్తారు. కొత్త వ్యక్తులు ఎవర్నీ తమతో కలవనీయరు. పాత వారి ద్వారానే కొత్తవారిపై గాలం వేస్తారు. బాగా నమ్మకం కుదిరిన తర్వాతనే పార్టీలో చోటు కల్పిస్తారు. కొకైన్, హెరాయిన్తో పాటు ఎల్ఎస్డీ,ఎండీఎంఏ వంటి రసాయన మత్తుమందులు కూడా ఈ పార్టీల్లో అందిస్తారు.

రాష్ట్రంలో స్థానికంగా గంజాయి పార్టీలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరగడానికి ఇదే కారణమని తెలుస్తోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు గతేడాది 12,700 కిలోల గంజాయి పట్టుకున్నారు. అబ్కారీశాఖ రాష్ట్రవ్యాప్తంగా మరో 3,542 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు ఇళ్లలో సాగు చేస్తున్న 16 వేలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కలిపి మరో 3 వేల కిలోల వరకూ పట్టుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో గతేడాది దాదాపు 20 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇది తక్కువ మొత్తమేమీ కాదు. పట్టుబడ్డదే ఈ స్థాయిలో ఉందంటే భద్రతా సిబ్బంది కళ్లు గప్పి వాడకందారులకు చేరింది ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

అక్కడా.. ఇక్కడా అనే తేడాలేదు: పరిస్థితి ఎంత వరకూ దిగజారిందంటే మారుమూల గ్రామాలే కాదు రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న కాలనీల్లోని జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లోనూ గంజాయి వాడకం విచ్చలవిడిగా జరుగుతోంది. గంజాయి ఒక్కక్కరుగా తాగరు. కనీసం ఐదారుగురు కలిసి బృందం ఏర్పడి దీన్ని సేవిస్తుంటారు. వీరంతా కలిసి ఏదైనా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. అమ్మకందారును అక్కడకు రప్పించి కావాల్సినంత కొనుక్కుంటారు. మద్యంపార్టీల తరహాలోనే ఇప్పుడు గంజాయి పార్టీలు మామూలయ్యాయి.

ఇక పబ్బుల వంటి చోట ఎక్స్​టసీ మాత్రలు, ఇతర రసాయన మందుల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కొకైన్, హెరాయిన్ వంటివి కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. డీఆర్ఐ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో గతేడాది కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆఫ్రికా నుంచి దిగుమతి అయిన రూ. 100 కోట్ల విలువైన హెరాయిన్​ను పట్టుకున్నారు. హైదరాబాద్​లో మత్తుమందుల వినియోగం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ముఠాలు గమనించాయని, అందుకే ఇక్కడకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని డీఆర్ఐ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: Drugs Manufacture: 'ఇంటినే ల్యాబ్‌గా మార్చాడు.. ఒక్క గ్రామ్‌తో 20 మందికి కిక్కిచ్చాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.