యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నుంచి సంగ్యాతండా మధ్యలో రెండు మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వీటి వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ లారీ మూలమలుపులో ఉన్న కెనాల్ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. టర్నింగ్ పాయింట్ల వద్ద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదాలు జరక్కముందే ఆర్అండ్బీ అధికారులు స్పందించాలన్నారు.
ఇదీ చదవండి: ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ