MLC Jeevan reddy about Raghava : రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం చెప్పిన వారి పైనే పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని... పోలీస్ వ్యవస్థ దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో జీవన్ రెడ్డి పర్యటించారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాల వారిని పరామర్శించి... వారికి భరోసా కల్పించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు దారుణంగా ఉందని... అధికార పార్టీనేతలందరూ ఇలాగే చేస్తున్నారని ఆరోపించారు. ఏదైనా ప్రతిపక్ష పార్టీ నిరసన కార్యక్రమం చేపడితే కొవిడ్ నిబంధనల పేరిట జైల్లో పెడుతున్నారని ఆక్షేపించారు. అదే అధికార పార్టీ అయితే రైతుబంధు సంబురాలు జరుపుకుంటున్నారని అన్నారు.
వనమా రాఘవ దుశ్చర్యలపై ఆలస్యం చేయకుండా.. ప్రత్యేక విచారణ జరపాలి. వనమా రాఘవ తీరుతో గతంలో ఓ పోలీస్ అధికారి మరణించాడు. గత 10 ఏళ్ల నుంచి వనమా రాఘవకు సంబంధించిన అన్ని కేసులపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
-జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి: MLA Jagga Reddy comments on DGP: 'కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్కేనా.. భాజపాకు వర్తించవా?'