mla son escaped: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాఘవేందర్ రావు పరారీలో ఉన్నారని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అతని కోసం స్పెషల్ టీమ్‌లు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.
వివాహేతర సంబంధమే కారణమా..
రామకృష్ణ కుటుంబం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో దంపతులు సహా వారి కుమార్తె సజీవదహనం అయ్యారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబం సజీవదహనం ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికిందని వెల్లడించారు. సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ పేరు ఉంది. అతనితో పాటు రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయి. వనమా రాఘవేందర్‌కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని... వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే... ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
నాకేం సంబంధం లేదు..
రామృకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై వనమా రాఘవేందర్ స్పందించారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.ఎటువంటి జోక్యం లేకున్నా తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఘటనపై పూర్తి విచారణ చేయాలని కోరారు. తన ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు.
తనను ఇరికించే కుట్ర..
అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని రామకృష్ణకు చెప్పడం నేరమా అని వనమా రాఘవేందర్ ప్రశ్నించారు. కావాలనే తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు కుట్రపన్నారని విమర్శించారు. తనన అభాసుపాలు చేసేందుకు కొంతమంది రామకృష్ణను ప్రలోభపెట్టారని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని... వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: