బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి సంగారెడ్డి జిల్లాకు వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒడిశాకు చెందిన బాలి అనే వ్యక్తి అతని భార్య, కుమార్తె హారతి(15)తో కలిసి బతుకుదెరువు కోసం ఐదు నెలల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి వచ్చాడు. గ్రామంలోని ఇటుకల బట్టీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఉదయం లేచి చూసేసరికి వారి కుమార్తె కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: సొంతూరుకు వెళ్తూ వాహనంలోనే వలసకూలీ ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం