ETV Bharat / crime

Minor Lovers Suicide: పురుగుల మందు తాగి మైనర్​ ప్రేమ జంట ఆత్మహత్య.. ఎందుకంటే..? - పురుగుల మందు తాగి మైనర్​ ప్రేమ జంట ఆత్మహత్య

Minor Lovers Suicide: అమ్మాయి, అబ్బాయి మైనర్లు. ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరిదీ ఒకే ఊరు.. అందులోనూ బంధువులు.. అంతా బాగానే ఉంది. మేజర్లయ్యాక ఇరు కుటుంబాలతో మాట్లాడి ఒప్పించుకుని ఒక్కటైతే సుఖాంతమయ్యే ఈ ప్రేమకథ.. విషాదాంతమైంది. కారణమేంటంటే..?

Minor love couple commits suicide at chorapalli

author img

By

Published : Feb 11, 2022, 6:10 PM IST

Minor Lovers Suicide: కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా చోరపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ఇరు కుటుంబాలను తీరని శోకసంద్రంలో ముంచేశాయి. గ్రామానికి చెందిన షిండే భిక్షపతి, సుగుణా దంపతుల కుమారుడు(17).. అదే గ్రామంలో ఉంటున్న బంధువులైన బాలు, స్రవంతి దంపతుల కుమార్తె ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పలేదు కూడా.

ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. గురువారం(ఫిబ్రవరి 10) రాత్రి సమయంలో.. ఇద్దరు కలిసి గ్రామ శివారులోని ఓ పెరట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమ్మాయి.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య విషయం చెప్పింది. ఆ మాట వినగానే తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే అబ్బాయి చనిపోయాడు. అమ్మాయిని మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.

ఇద్దరి మృతదేహాలను చూసి.. ఇరు కుటుంబాలు గుండెలు బాదుకుంటూ రోధించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.