ETV Bharat / crime

మైనర్​ బాలికపై అత్యాచారం.. కేసు నమోదు - కామారెడ్డిలో దారుణం

నమ్మిన వారినే కామంతో కాటేశాడు ఓ కామాంధుడు. మైనర్​ బాలికపై మామ వరుసైన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండల కేంద్రంలో దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

minor girl  raped in kamareddy district in machareddy mandal
మైనర్​ బాలికపై అత్యాచారం.. కేసు నమోదు
author img

By

Published : Mar 18, 2021, 9:31 PM IST

మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో జరిగింది. నమ్మకంగా ఉంటూ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

బాలికను నమ్మించి..

బాలిక తల్లి మరణించడంతో అతనే బాగోగులు చూసుకుంటున్నట్లు నమ్మించాడు. వరుసకు మేనమామ కావడంతో వాళ్ల ఇంటికి తరచు వచ్చేవాడని బాలిక తరఫు బంధువులు తెలిపారు. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న అసిఫ్ రెండు రోజుల క్రితం బాలికను కామారెడ్డికి తీసుకొచ్చి ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించినట్లు రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. అనంతరం బాలికను గంభీరావుపేటలో వదిలేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. బంధువని నమ్మినందుకు బాలిక జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయి బంధువు బాబా డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.