ETV Bharat / crime

భూనిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్​.. కేసీఆర్​పై విపక్షాల ఫైర్​

Tension in Guddatipally : సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్​ రన్​ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు భూనిర్వాసితులను అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. భూనిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జీ

author img

By

Published : Jun 13, 2022, 8:21 AM IST

Updated : Jun 13, 2022, 12:57 PM IST

గుడాటిపల్లిలో ఉద్రిక్తత.. భూనిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జీ

Tension in Guddatipally : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో.. అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో రెండు, మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టుకు ట్రయల్‌ రన్‌ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పరిహారం చెల్లించకుండా ట్రయల్‌రన్‌ ఎలా చేస్తారంటూ భూ నిర్వాసితులు నిలదీస్తుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ట్రయల్‌ రన్‌ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో గుడాటిపల్లిలో సుమారు 100 మంది భూనిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య గ్రామంలో కెనాల్ కాలువ కోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంపు నీటిని విడుదల చేసి.. ఆ నీటిని ఈ కెనాల్ ద్వారా కుడి, ఎడమ కాలువలకు అనుసంధానం చేసి సాగునీరు విడుదల చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మీడియాను గ్రామంలోకి అనుమతించడం లేదు.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం, అధికారులు సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించాలి కానీ.. అర్ధరాత్రి వేళ పోలీసులతో దౌర్జన్యంగా తమ ఇళ్లపై దాడి చేయించడం ఏంటని భూ నిర్వాసితులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడ-మగ అని తేడా లేకుండా కొట్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందించారు. నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని రేవంత్​ ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

  • నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి.బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి
    సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

    వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది pic.twitter.com/i0arUrBOq2

    — Revanth Reddy (@revanth_anumula) June 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పనులు నిలిపివేయాలి.. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని బండి సంజయ్​ పేర్కొన్నారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. నిర్వాసితుల కాళ్లు, చేతులు విరగ్గొట్టారని ఆయన ఆరోపించారు. తలలు పగులగొట్టారన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి పాలించడం మానుకోవాలని హితవు పలికారు. వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్​ చేశారు. నిర్వాసితులను ఆదుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని సూచించారు.

ఇవీ చూడండి.. Monsoon Enters Telangana : తెలంగాణను పలకరించిన తొలకరి జల్లు

అల్లర్ల కారకులపై కన్నెర్ర.. యూపీలో 304 మంది అరెస్టు

Last Updated : Jun 13, 2022, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.