ఏపీ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్టీసీ బస్సుపై మతిస్తిమితం లేని ఓ యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. పామూరు బస్టాండ్ కూడలిలో బస్సు నిలిపి డ్రైవర్ టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగగా అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... పొంతన లేని సమాధానాలు చెప్పాడు. యువకుడికి మతిస్తిమితం లేదని పోలీసులు ప్రాథమిక నిర్థరణకు వచ్చారు.
ఇదీ చదవండి: Intestinal Ulcer: కరోనా నుంచి కోలుకున్న వారిలో కలవరపెడుతున్న కొత్త సమస్య