భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. చర్ల మండలం అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూంభింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు మిలీషియా సభ్యులు తారసపడడంతో పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
వీళ్లంతా.. గతంలో అనేక విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు భద్రాచలం ఏఎస్పీ డా. వినీత్ చెప్పారు. నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కూంబింగ్‌లో చర్ల సీఐ అశోక్, ఎస్ఐ వెంకటప్పయ్య, సీఆర్పీఎఫ్ కమాండెంట్ హరి ఓంకారే, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: 51 మొక్కలే వరకట్నం- ఎందరికో ఆదర్శం!