ETV Bharat / crime

Life Imprisonment in Murder Case : 2013లో యువకుడి హత్య.. 2022లో నిందితులకు జీవిత ఖైదు - Petbasheerabad murder case

Life Imprisonment in Murder Case : వివాహేతర సంబంధాన్ని బయటపెడతానన్న యువకుడిని హత్య చేసిన ఘటనలో నిందితులిద్దరికి జీవిత ఖైదు విధిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. 2013లో పేట్​బషీరాబాద్ పీఎస్​ పరిధిలోని పద్మానగర్​లో జరిగిన ఈ హత్యకేసులో సోమవారం రోజున తీర్పునిచ్చింది.

Life Imprisonment in Murder Case
Life Imprisonment in Murder Case
author img

By

Published : Jan 25, 2022, 10:09 AM IST

Life Imprisonment in Murder Case : 2013లో పేట్​బషీరాబాద్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్​లో జరిగిన హత్య కేసులో మేడ్చల్ కోర్టు తీర్పును వెలువరించింది. నిందితులిద్దరికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

ఆ కేసు వివరాలు..

Life Imprisonment in Pet Basheerabad Murder Case : ఆలేరుకు చెందిన శ్రీనివాస్(35), రజిని(33) వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని మేడ్చల్ జిల్లా పేట్​ బషీరాబాద్​ పీఎస్ పరిధిలోని పద్మానగర్​లో పక్కపక్క ఇళ్లలో నివాసముండేవారు. రజిని తరఫు ఓ బంధువు కృష్ణచైతన్య(22) అనే యువకుడు కొన్నాళ్లు ఉండేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. చదువు కోసం వచ్చిన కృష్ణచైతన్యకు.. రజిని-శ్రీనివాస్​ల సంబంధం గురించి తెలిసింది.

Life Imprisonment in Murder Case
రజిని
Life Imprisonment in Murder Case
శ్రీనివాస్

తన లైంగిక వాంఛ తీర్చకపోతే.. వారి గుట్టు రట్టు చేస్తానని రజినిని బ్లాక్​మెయిల్ చేశాడు. అతని నుంచి వేధింపులు ఎక్కువవ్వడంతో ఈ విషయాన్ని రజిని... శ్రీనివాస్​కు చెప్పింది. ఇద్దరు కలిసి కృష్ణచైతన్యను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చారు. 2013 ఆగస్టు 28 రాత్రి.. మద్యం సేవించి వచ్చిన కృష్ణ చైతన్యకు ఆహారంలో హైడ్రస్ పౌడర్​ను కలిపి ఇచ్చింది రజిని. రసాయనం కలిపిన ఆహారం తిన్న కృష్ణ చైతన్య వాంతులు చేసుకుంటూ తెల్లవారుజామున చనిపోయాడు.

అతను మరణించాడని నిర్ధరించుకున్న రజిని-శ్రీనివాస్​లు.. అతని మృతదేహాన్ని ఓ మూటలో కట్టి అక్కణ్నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో కృష్ణచైతన్య మృతి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. సోమవారం రోజున మేడ్చల్ కోర్టు ఈ కేసుపై తీర్పును వెలువరించింది. నిందితులిద్దరికి జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.