Fire Accident: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఉన్న ప్రభుత్వ వస్త్ర సంస్థ (టెస్కో) గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిన క్రమంలో గోదాం గోడలు కూలిపోయాయి.
ఈ ప్రమాదంలో టెస్కోకి సంబంధించిన సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రెండేళ్లుగా గురుకులాలకు సరఫరా చేయాల్సిన కార్పెట్లు.. టవల్స్.. బెడ్షీట్లతో పాటు షూటింగ్, సెట్టింగ్ వస్త్రాలను గోదాముల్లో నిల్వ చేసినట్లు టెస్కో సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని... భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి: