నల్గొండ ప్రభుత్వాసుపత్రిమార్చురీ పక్కన భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆస్పత్రి ఆవరణలో చెత్తకు నిప్పు పెట్టారు. చెత్తలోని వ్యర్థాలు, రసాయనాలు భారీ శబ్దంతో పేలాయి. మంటలు ఎగసిపడడంతో 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. మార్చురీ సమీపంలో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినప్పిటికీ... వినడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన, పొగతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ చదవండి: