ETV Bharat / crime

పిల్లలతో సహా మహిళ అదృశ్యం.. రెండు రోజులైనా..! - Woman missing with kids in Nizamabad

Woman missing with kids in Nizamabad : నిజామాబాద్​లో ఓ వివాహిత తన కుమారుడు, కుమార్తెతో సహా అదృశ్యమవటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల నుంచి ఎంత వెతికినా ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. వాళ్లను వెతికే పనిలో పడ్డారు.

పిల్లలతో సహా మహిళ అదృశ్యం.. రెండు రోజులైనా..!

author img

By

Published : Aug 9, 2022, 1:54 PM IST

Woman missing with kids in Nizamabad : నిజామాబాద్​లో తల్లితో పాటు ఇద్దరు పిల్లల అదృశ్యం కలకలం రేపుతోంది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్​నగర్​కు చెందిన కవిత(32) అనే వివాహిత తన కూతురు అనూష(14), కుమారుడు మహేందర్( 7 )ను తీసుకొని ఈ నెల 7న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు బంధువుల ఇళ్లతో పాటు తెలిసిన చోట్లన్నీ వెతికినా ఆచూకీ దొరకలేదు.

కనిపించకుండాపోయిన తల్లి కవిత, పిల్లలు అనూష, మహేందర్

ఇక చేసేదేమీ లేక కవిత భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకూ.. పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి ఆ మహిళ ఎందుకు వెళ్లిపోయిందన్న కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.